కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో గత నెల రోజులకు పై వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే విధంగా రేపు ఉదయం 11 గంటలకు రైతులు “ట్రాక్టర్ల ర్యాలీ” నిర్వహించనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని నాలుగు ఆందోళన ప్రాంతాల నుంచి రేపు “ట్రాక్టర్ల ర్యాలీ” ప్రారంభం కానుంది. ’సింఘు నుంచి టిక్రి, టిక్రి నుంచి షాజహనపూర్, ఘాజిపూర్ నుంచి పల్వాల్, పల్వాల్ నుంచి ఘాజిపూర్ వరకు ర్యాలీలు జరగనున్నాయి. అయితేజనవరి 26న నిర్వహించే “ట్రాక్టర్ల ర్యాలీ”కి ఇది రిహార్సల్ గా జరగనుంది. ఇతర రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపడం, సవరణలతో సరిపెడతామనడం సరికాదు. సమస్య పరిష్కారంపై కేంద్రానికి శ్రద్ధ లేదని అర్థ అవుతోంది. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం తీవ్రతరం అవుతోంది. ఈ నెల 8న కేంద్రం రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తాం. 13, 14 తేదీల్లో లోహ్రి, మకర సంక్రాంతి సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేస్తాం. జనవరి 18న “మహిళా కిసాన్ దివస్” ఆందోళనలు చేపడుతాము. జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా “ఆజాద్ కిసాన్”ఆందోళనలు చేపడతాం. జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్ నిర్వహిస్తాం అని రైతు సంఘాల నాయకులు తెలిపారు.
previous post