BREAKING NEWS:
delhi cm arvind kejriwal strike in raj niwas delhi cm arvind kejriwal strike in raj nivas

ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదని…కేజ్రీవాల్..

55

ఢిల్లీ రాజ్ నివాస్ లో దాదాపు 24 గంటల నుంచి చేస్తున్న ఈ దీక్ష పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆందోళన కొనసాగుతుంది. తమ డిమాండ్లను అంగీకరించే వరకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇంటిని వీడేది లేదంటూ అక్కడే కూర్చున్నారు. రేషన్ సరుకులను ఇంటివద్దకె పంపించేందుకు ఆమోదం మరియు ఆందోళన చేస్తున్న ఐ.ఏ.ఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా అనిల్ బైజాల్ చుట్టూ తిరిగిన స్పందించలేదని ఆరోపించారు. కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంత్రులు సత్యేంద్ర కుమార్ చైన్, గోపాల్ రాయ్ లు ఉన్నారు. ఎవరిని లోపలికి వెళ్లనీయడం లేదు. 

రాత్రి నుంచి సమావేశం కోసం ఎదురు చూస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితులను పరిశీలుస్తున్న వైద్యులు.

అయితే కేజ్రీవాల్ ఆందోళనపై ఎల్.జి. కార్యాలయం స్పందించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిరసనకు దిగడంతో పాటు ఐ.ఏ.ఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది. ఆప్ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రాజ్ నివాస్ దగ్గర బారి బందోబస్తు ఏర్పాటు చేశారు, దీనికి తోడు అదనపు బలగాలను మోహరించారు.

తమ ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఈరోజు తమ ఉద్యోగానికి సెలవు కూడా ప్రకటించుకున్నారు.