telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : ఢిల్లీ ఖాతాలో మరో విజయం

ఐపీఎల్ 2021 లో ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ లో 167 పరుగుల టార్గెట్ తో వచ్చిన ఢిల్లీకి ఓపెనర్లు మొదటి వికెట్ కు పృథ్వీ షా, శిఖర్ ధావన్ అర్ధశతకపు భాగసౌమ్యం నెలకొల్పారు. కానీ షా(39) పెవిలియన్ చేరుకున్న తర్వాత స్మిత్(24), పంత్(14) త్వరగా ఔట్ అయ్యారు. కానీ ఆ జట్టు స్టార్ ఓపెనర్ ధావన్(69) దగ్గరుండి జట్టుకి 7 వికెట్లు తేడాతో విజయాన్ని అందించారు.

అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12) ఔట్ అయిన తర్వాత గేల్(13) డేవిడ్ మలన్(26) విఫలమైన చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ 58 బంతుల్లో 99 పరుగులు చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.

Related posts