Deepika-Padukone-building-fire

ముంబై లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న దీపికా పదుకొనే భవనం…

40

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది, వర్లి లోని ప్రభాదేవి రోడ్ లో ఉన్న 33 అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. బీల్ మండే టవర్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. 33వ అంతస్థులోనే మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ టవర్స్ లో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తో పాటు పలువురు ప్రముఖులు నివాసం ఉంటున్నారు.

అగ్నిప్రమాదం బారి ఎత్తున సంభవించడంతో 8 ఫైర్ ఇంజన్లను రప్పించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరకు భవనంలో చిక్కుకున్న 100 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. విద్యుత్ షాట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. భవనంలో ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దీపికా పదుకొనే లేరని చెబుతున్నారు, బీల్ మండే టవర్ సమీపాన ప్రఖ్యాతి గాంచిన సిద్ది వినాయక ఆలయం కూడా ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

video source: ndtv