telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 29, బుధవారం రాశిఫలాలు..

మేషరాశి..

ఉపాధ్యాలయులకు ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సోదరులతో మనస్పర్థలు ఏర్ప‌డ‌తాయి.

వృషభరాశి..

బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు త‌లెత్తుతాయి. కొందరికి పొత్తికడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావచ్చు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.. వాహనయోగం క‌లుగుతుంది.

మిథునరాశి..

టీచ‌ర్స్‌కు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

కర్కాటకరాశి..

బందు మిత్రుల‌తో విందువినోదాలు పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. తల పెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ప్రేమికుల న‌డ‌వ‌డిక వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభిస్తాయి. కుటుంబ బాధ్యతలను సంక్క‌మంగా పూర్తి చేస్తారు.

సింహరాశి..

ఆత్మవిశ్వాసం మ‌రింత‌ పెరుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం..కొన్ని రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. రుణయత్నాలు చేస్తారు. అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. అయిన‌వారితో ఆస్తి వివాదాలు త‌లెత్తుతాయి. దైవదర్శనాలు చేస్తారు.

కన్యరాశి..

సామాజిక స్థాయిలో మంచి పేరు సంపాదించుకుంటారు. బంధువులతో క‌లిసి స‌ర‌దాగా గడుపుతారు. ఆజాగ్ర‌త్త వ‌ల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో జాగ్ర‌త్త వ‌హించ‌డం అవసరం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి.

తులరాశి..

ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆస్తి వ్యవహారాల్లో అయినవారితో విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యసమస్యలు త‌లెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృశ్చికరాశి..

అనుకోని సంఘటనలు ఎదుర‌వుతాయి. ధనప్రాప్తి క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రైవేటు రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం విష‌యంలో తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి.

ధనస్సు రాశి..

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు క‌నిపిస్తున్నాయి. చిన్న త‌ర‌హ వ్యాపారాలు మంచి కాలం న‌డుతుస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారంలో చేసిన పెట్టుబడులకు మంచి ఫలితాలను పొందవచ్చు.

మకర‌రాశి..

ప్రభుత్వ రంగాలలో ఉన్న‌వారికి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. షాపింగ్‌ల్లో ఖర్చులు ఎక్కువ‌గా చేస్తారు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూర‌ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్ధులు మరింతగా శ్రమిస్తే అనుకున్న గోల్‌కు రిచ్ అవ్వ‌గ‌ల‌రు..

కుంభరాశి..

ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. చాలా కాలంగా ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డుతుంది. ఉపాధ్యాయులకు చికాకులు త‌ప్ప‌వు, వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం మంచిది. అనుకోకుండా దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

మీనరాశి..

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు నరాలకు సంబంధించి ఆనారోగ్య స‌మ‌స్య‌లు బాధిస్తాయి. కొన్ని పనులు అసంకల్పితంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల రాకపోకవల్ల ఇబ్బంది ప‌డ‌తారు. వస్తులాభాలు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత‌మాత్రంగా ఉంటాయి.

Related posts