telugu navyamedia
సినిమా వార్తలు

విశాఖలో “డియర్ కామ్రేడ్” ప్రీ రిలీజ్ ఈవెంట్

Dear-Comrade

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్‌” ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో ఉన్న విజ‌య్‌, ర‌ష్మిక లిప్‌లాక్ సీన్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సోషల్ మెసేజ్ తో పాటు యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంకి సంబంధించి మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. ఇటీవ‌ల జ‌ర‌గిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ని ఈ నెల 24న రాత్రి 7 గంటలకు విశాఖ జిల్లా సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో శృతి రామచంద్రన్ కీల‌క పాత్ర పోషించారు.

Related posts