telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు

Dear-Comrade

సెన్సేష‌న‌ల్  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌  బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. “గీత‌గోవిందం” బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌న‌ప‌డితే, ర‌ష్మిక ఉమెన్ క్రికెట‌ర్‌గా క‌న‌ప‌డుతున్నారు. సినిమా ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుందని ఇది వ‌రకే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాల‌ను శ‌రవేగంగా జ‌రుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైల‌ర్ డేట్‌ను అనౌన్స్ చేసింది. జూలై 11న ఉద‌యం 11 గంట‌ల 11 నిమిషాలకు “డియ‌ర్ కామ్రేడ్” ట్రైల‌ర్ విడుద‌లవుతుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది. నాలుగు ద‌క్షిణాది భాషలైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Related posts