telugu navyamedia
క్రీడలు వార్తలు

మనీష్ ను పక్కన పెట్టడం పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు…

ఐపీఎల్ లో హ్యాట్రిక్ పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌పై విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్‌.. నిన్న జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో సూపర్‌ ఓవర్‌లో పరాజయం పాలైంది. ధోని పై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. సన్‌రైజర్స్ ఎలెవన్ నుంచి మనీష్ పాండేను ఎందుకు తొలగించారు అని అడిగిన ప్రశ్నకు.. ‘మనీష్ పాండేకు తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం అది కఠినమైన నిర్ణయం. అయితే అది సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం. నేనేమీ చేయలేను. పాండేను పక్కనపెట్టడం నాకిష్టం లేదు’ అని వార్నర్ స్పష్టం చేశాడు. టామ్ మూడీ, ట్రెవర్ బేలిస్, బ్రాడ్ హాడిన్, వివిఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ సన్‌రైజర్స్ కోచింగ్ బృందంలో ఉన్న విషయం తెలిసిందే. మనీష్ పాండే స్థానంలో 23 ఏళ్ల విరాట్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆడాడు. 14 బంతుల్లో 4 పరుగులు చేశాడు. దీనిపై డేవిడ్ వార్నర్ స్పందిస్తూ… ‘చెపాక్ పిచ్ సవాల్ విసిరింది. విరాట్‌ను ఏమాత్రం నిందించలేను. అతను చాలా మంచి ఆటగాడు. ఈ పిచ్‌పై కుదురుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే అతడికి ఇబ్బందిగా మారింది. ఢిల్లీ బౌలర్లు కూడా మధ్య ఓవర్లలో బాగా వేశారు. కేన్ చివరి ఉండి బాగా ఆడాడు. ఆరంభంలో జానీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు’ అని పేర్కొన్నాడు.

Related posts