ఏపీలో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.
సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని గుర్తుచేశారు. గత 50 ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలు అందించారని వివరించారు.
ఎన్నో పెద్ద యూనివర్సిటీల నుంచి చాలామంది దత్తాత్రేయుడి వద్ద వైద్యం నేర్చుకున్నారని తెలిపారు. ఆయన సలహాలతో క్యాన్సర్ నివారణ చర్యలు చేపడతామన్నారు.
వైసీపీ శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు