telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ….

amaravati farmers protest on 15th day

రాజధాని అమరావతికి సంభందించిన కేసులను రోజువారీ విచారణ జరపనుంది ప్రభుత్వం. సిఎం క్యాంపు ఆఫీసు, స్టేట్ కమిషనరేట్ ల విషయంలో పూర్తివివరాలతో కౌంటర్ ఇప్పటికే వేసింది ప్రభుత్వం. కమీషనరేట్ లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని గతంలో పేర్కోన్న ప్రభుత్వం తరపు న్యాయవాది.. అయితే వాటి జాబితాను ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది. పరిపాలనా వికేంద్రికరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుల కూర్పుకు సంభందించి ఫైళ్ళు సమర్పించాలని గతంలో పిటిషన్ వేశారు మండవ రమేష్. ఆయన తరపున వాదనలు నేడు వినిపించనున్నారు ఉన్నవ మురళీధర్ రావు. ఈ పిటిషన్ కు సంభందించిన వివరాలు సీల్డ్ కవర్ లో ధర్మాసనం ముందు ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమీటీకి పంపడం.. తరువాతి పరిణామాలపై ఇప్పటికే ఎమ్మెల్సి దీపక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. అయితే ఆయన తరపున వాదనలు వినిపిస్తున్నారు న్యాయవాది ఉన్నవ… అయితే మండలిలో అప్పటి ఆడియో వీడియో ఫుటేజి ని నేడు సమర్పించాలని ధర్మసనం ఆదేశించింది. ఇక రాజధాని పిటిషన్ లలో ఉత్తరాంధ్ర, రాయల సీమ కు చెందిన పిటిషనర్ లను ఇంప్లీడ్ కు ఉన్న అవకాశాలపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Related posts