మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం దాడి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుది మల్టీ టంగ్ అని.. క్షణానికి ఒకలా మాట్లాడతారని దాడి ధ్వజమెత్తారు. కాంగ్రెసేతర పక్షాలన్నింటిని ఏకంగా చేసి కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇవాళ్టీ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలకు చోటు లేదని.. దానిని అసలు టీడీపీగానే చూసే పరిస్ధితి కనిపించడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని అనుబంధ సంస్థగా మార్చేశారని వీరభద్రరావు అన్నారు. ఏ క్షణంలోనైనా టీడీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దాడి పేర్కొన్నారు. చంద్రబాబుకు కావాల్సింది కేవలం పవర్ మాత్రమేనని సిద్ధాంతాలు ఆయనకు అవసరం లేదన్నారు. జగన్ పాలన రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని దాడి తెలిపారు. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యానని దాడి స్పష్టం చేశారు.