BREAKING NEWS:
land disputes

భూ వివాదంలో తండ్రి కొడుకుల దారుణహత్య

47
 భూ వివాదంలో తండ్రి  కొడుకులు దారుణహత్యకు గురయ్యారు.  వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఈ సంఘటన  మంగళవారం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తండ్రి కొడుకులను కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా కలకం రేపింది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, అతని కొడుకును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. 
 
పొలంకు సంబందించిన భూ వ్యవహారమే తోనే ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున పొలంలో ఉన్న తండ్రికొడుకులను హత్యచేసిన నిందితులు ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. విషయం తెలుసుకొన్న  జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.