telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫుడ్ డెలివరీ బాయ్ ని యువతులు లాక్కెళ్లి… లైట్లు ఆపేసి…!?

Food-Delivery-Boy

ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి చేసిన యువతులను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్ డెలివరీ చేయడానికి షార్జాలోని ఓ ఫ్లాట్‌కు డెలివరీ బాయ్ వెళ్లగా.. ఓ యువతి వచ్చి ఆర్డర్ తీసుకుని లోపలకు వెళ్లిపోయింది. ఎంత సేపటికీ రాకపోవడంతో డెలివరీ బాయ్ బెల్ కొట్టాడు. ఇదే సమయంలో అనేక మంది యువతులు బయటకు వచ్చి డెలివరీ బాయ్‌ను లోపలకు లాక్కెళ్లారు. అనంతరం లైట్లు ఆపేసి డెలివరీ బాయ్‌‌ని కత్తతో బెదిరించి దాడి చేశారు. అతని ఫోన్‌, జేబులో ఉన్న 800 దిర్హామ్‌లు కూడా లాక్కున్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతిని ఆమె స్నేహితురాళ్లను పోలీసులు అరెస్ట్ చేయగా.. లాక్కున్న ఫోన్, డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ యువతి పోలీసులకు తెలిపింది. కాగా, ఈ కేసు విచారణ మే 20కు వాయిదా పడింది.

Related posts