telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రఫేల్‌ కుంభకోణం బయటపడుతుందనే ఆలోక్‌వర్మ బదిలీ: నారాయణ

CPI Narayana Alok Verma transferred Rafel

రఫేల్‌ కుంభకోణం బయటపడుతుందనే సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మను బదిలీ చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.సీబీఐపై ఇలాంటి ప్రత్యక్షచర్య 55 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా ఆయన కొనసాగితే రఫేల్‌ కుంభకోణం బహిర్గతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వర్మను అగ్నిమాపక శాఖకు మార్చారని ఆరోపించారు. ప్రధాని స్థాయిలోనే చట్టా ల ధిక్కరణ జరిగితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

అలోక్‌వర్మను సీబీఐ డైర్టెకర్‌గా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శాలు తట్టుకోలేక ప్రధాని నిరాశ, నిస్పృహలతో అత్యున్నతస్థాయి కమిటీ పేరుతో వర్మను ఫైర్‌ సర్వీస్‌కు బదిలీచేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని వెక్కిరించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మతపరంగా విభజిం చే కుట్ర చేస్తోందని నారాయణ ధ్వజమెత్తారు.

Related posts