telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో విజృంభిస్తున్నక‌రోనా మహమ్మారి థర్డ్‌ వేవ్..

భారత్​లోక‌రోనా మహమ్మారి థర్డ్‌ వేవ్ విజృంభిస్తుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెర‌గ‌డంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన అన్ని కోవిడ్ కేసులలో మొత్తం 8,209 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.  అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 6.02% పెరిగింది. వైరస్​తో ఇప్ప‌టివ‌ర‌కు  మరో 385  మంది మరణించ‌గా..1,51,740 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ  ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ COVID-19 టీకా ప్ర‌క్రియ‌ 156 కోట్లకు చేరుకుందని, శనివారం నాటికి 57 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

మొత్తంగా, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 18-44 సంవత్సరాల వయస్సు గలవారికి 52,40,53,061 మొదటి డోసులు ఇవ్వబడ్డాయి మరియు టీకా డ్రైవ్ యొక్క దశ-3 ప్రారంభమైనప్పటి నుండి 36,73,83,765 రెండవ డోసులు ఇవ్వబడ్డాయి. అలాగే 15-18 ఏళ్లలోపు వారికి 3,36,09,191 వ్యాక్సిన్‌ డోసులు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

Related posts