couple accused of having sex on road divider in mumbai

కామా తురాణాం నభయం న లజ్జ…అంటే ఇదే..

42

ముంబై మహా నగరంలో పట్టపగలే నడిరోడ్డుపైన వేలాది వాహనాలు, జనసంచారం మధ్యలో ఓ జంట బలితెగించి నడిరోడ్డులోనే సెక్స్ లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో కలకలం లేపుతుంది. వివరాల ప్రకారం గురువారం రోజున ముంబై నగరంలోని మెరైన్ డ్రైవ్ ఏరియా నారిమన్ పాయింట్ దగ్గర గోవా నుంచి వచ్చిన యువతి, విదేశీ వ్యక్తి చేసిన ఈ పని రోడ్డున పోయే వాహనదారులు, జనాలు ఆగి వారిని ఫోటోలు, వీడియోలు తీస్తున్న పట్టించుకోకుండా వారిపనిలో నిమగ్నమయ్యారు, సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది.

మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ కు అడుగుల దూరంలో, ఎయిర్ ఇండియా బిల్డింగ్ – మరైన్ హోటెల్ ప్లాజా మధ్య బిజీ రోడ్డులో ఈ సంఘటన జరగడం పై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుంటున్న సమయంలో వారిని గమనించిన ఆ జంట హుటాహుటిన తమను సర్దుకొని అక్కడనుంచి అవతలి రోడ్డువైపుకు వెళ్లిపోయారు. పరిగెడుతున్న వాళ్ళను పట్టుకునేందుకు వెంబడించిన పోలీసులు ఆ యువతిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు, కానీ ఆ విదేశీ యువకుడు మాత్రం ఇంకా దొరకలేదు.

అదుపులోకి తీసుకున్న యువతిని ప్రశ్నించగా తాను గోవా నుంచి వచ్చానని, అతని గురుంచి ఎలాంటి సమాచారం తెలియదని చెప్పగా, ఆ యువతీ మానసిక స్థితి సరిగ్గా లేదని భావించిన పోలీసులు ఆమెను మహిళా సురక్షా కేంద్రానికి తరలించారు, కానీ వీరిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా కేవలం దగ్గర్లోని సీసీటీవీ కెమెరాల ద్వారా ఫుటేజీని సేకరించి ఆ విదేశీ యువకుడిని గాలిస్తున్నారు.

పట్టపగలే నడిరోడ్డు మధ్యలో అదీ పోలీసుల హెడ్ క్వార్ట్రర్ చేరువలోనే ఈ ఘటన జరగడం పోలీసులను ఆశ్యర్యానికి గురి చేసింది. కొందరు మహిళా సంఘాల వారు ఆ యువతికి అండగా నిలపడతామని చట్టపరమైన కేసులు నమోదు చేసి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు.