telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

వీవీ ప్యాట్లను లెక్కించే విధానం ఇదే

VVPAt

ఈరోజు ఉదయమే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటి వరకు తెలంగాణాలో తెరాస 11 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీ, కేంద్రంలో ఎన్డీయే 300 స్థానాలకు పైగా లీడింగ్ లో ఉన్నాయి. కంట్రోల్ యూనిట్ల లెక్కింపు మొత్తం పూర్తిచేసిన తర్వాత ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్ల చీటీలను లెక్కిస్తారు. లెక్కించే వీవీప్యాట్లను లాటరీద్వారా ఎంపికచేస్తారు. ఎంపికచేసిన వీవీప్యాట్లను ప్రత్యేకంగా ఒక మెష్‌తో ఏర్పాటుచేసిన బూత్‌లోకి తరలించి, అక్కడ అభ్యర్థుల గుర్తులతో కూడిన బాక్స్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రతి 25 చీటీలను ఒక కట్టగా కడుతారు. వాటిల్లోంచి అభ్యర్థులవారీగాను చీటీల వేరుచేసి బాక్సుల్లో వేస్తారు. ఆ తర్వాత బాక్సుల్లోని మొత్తం చీటీలను లెక్కిస్తారు. ఒక్కో వీవీప్యాట్ లెక్కింపునకు గరిష్ఠంగా గంట సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Related posts