corrupted police in guntur

లంచ గొండి తనాన్ని అరికట్టాల్సిన పోలీసు లంఛం డిమాండ్ చేస్తే?

17

గుంటూరు సీసీఎస్ పోలీస్ ఒకచైన్ స్నాచింగ్ కేసు అడ్డంపెట్టుకొని నిందితుల కుటుంబం నుంచి 3 లక్షలు లాగేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారం ఏ కానిస్టేబుల్ లో లేదా ‘ఎస్ ఐ’ స్థాయిలో జరిగింది కాదు ఏకంగా సర్కిల్ ఇంస్పెటెర్ ఈ డీల్ కి దిగాడు. ఆయనకు తోడు అంటూ ఒక బ్రోకర్ ఈ కథ నడిపాడు.

ఇటీవల ఈ స్టేషన్ కు ఒక కేసు వచ్చింది. ముగ్గురు కుర్రాళ్లు బైక్ పై వెళుతూ బ్యాగ్ స్నాచింగ్ చేశారు. అందులో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయట, బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు ఎట్టకేలకు సదరు కుర్రాళ్లను పట్టుకున్నారు. ముగ్గురూ ఇంటర్ మీడియట్ విద్యార్థులే. వాళ్ల తల్లితండ్రులకు కబురు పంపారు, కేసు పెడితే కుర్రాళ్ల భవిషత్ పాడైపోతుందన్నారు. దీనితో ఆ తల్లితండ్రులు కేసు లేకుండా చూడమన్నారు, అయితే 3లక్షలు ఇస్తే కేసు మాఫీ చేసి మీ పిల్లలను వదిలేస్తాం అన్నారు. అంత ఇచ్చుకోలేము అని బ్రతిమలాడితే లక్షున్నరకి దిగాడు, ముగ్గురిలో ఒకడు లక్షున్నర అప్పగించారంట. అంత ఇచ్చుకోలేమని మరొక్కరి తల్లితండ్రులు సిఐ ని బ్రోకర్ ని బతిమాలాడితే లక్ష 20 వేలకు పైసా తగ్గేది లేదని చెప్పారు.

బాధితుడు : డబ్బులు ఇస్తే ఎపుడు వదిలేస్తారు సార్.
సిఐ కరీం : ఇపుడు ఇస్తే .. ఇవాళే వదిలేస్తా ..మీదే ఆలస్యం
బాధితుడు : కోర్టుకి వేళ్లాలా సర్…
సిఐ కరీం : లేదు లేదు .. ఇపుడు దబ్బులిస్తే సాయంత్రం వదిలేస్తా … లేదంటే రేపు ఉదయం పదకొండుకు విడుదల చేస్తా.
బాధితుడు : సార్ అంత డబ్బు కష్టం సార్.
సిఐ కరీం : నాకు అర్థం కాలేదు
బ్రోకర్ : ముందే చెప్పానుగా … సార్ చాలా తగ్గించారు
సిఐ కరీం : సరే కానీ
బ్రోకర్ : మళ్ళీ రెండో మాట మాట్లాడొద్దు
బాధితుడు : సార్ ఈ పదివేలు తీసుకోండి అడ్వాన్సగా … మిగతాది ట్రాన్స్ ఫర్ చేస్తా సార్ ….
సిఐ కరీం : ఏ …. వద్దు … పొద్దున మొత్తం ఒక్క సారె ఇవ్వు
బాధితుడు :ఏం కాదు సార్ తీసుకోండి
సిఐ కరీం : ఆ డబ్బు ఈయన (బ్రోకర్ ) చేతికివ్వు …. ఒకే ఇక వెళ్ళండి ….
బ్రోకర్ : నీకు నామీద నమ్మకం లేదా … నమ్మకం ఉంటేనే ఇవ్వు .. సిఐ సార్ కి స్టేషన్ లో డబ్బు ఇవ్వను, సీక్రేట్ ప్లేస్ కి వచ్చి సార్ తీసుకుంటారు.
బాధితుడు : స్టేషన్ లో తీసుకోరా .. సిఐ సార్
బ్రోకర్ : లేదు లేదు .. ఇక్కడ తీసుకోరు, బెయిల్ డబ్బులు ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు కానీ ఆయనకి వచ్చేది మాత్రం మరో చోట నా దగ్గర సీక్రెట్ గా తీసుకుంటారు.

అయితే కేసు నుంచి తప్పించాలంటే 3లక్షలు లంచం ఇవ్వాలని వేధిస్తున్నారని విద్యార్థుల తల్లితండ్రులు చెప్తున్నారు. లేదంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని బ్లాక్ మెయిల్ చేస్తన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై ఇప్పటికే ‘హెచ్ ఆర్ సి’ లో కూడా పిర్యాదు చేశాము అని చెప్పారు.