telugu navyamedia
రాజకీయ వార్తలు

నిన్న ఒక్క రోజే 136 మంది ..పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య

karona virus case in canada found

చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ఆ దేశంలో ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. ఆ దేశంలో రోజు రోజుకు కరోనా (కొవిడ్‌-19) మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 2 వేల మంది మృతి చెందినట్లు చైనా జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. హుబే ప్రావిన్స్‌లో నిన్న ఒక్క రోజే 136 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1749 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇప్పుడు ఏకంగా కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న ఓ దవాఖాన డైరెక్టరే ఈ వ్యాధికి బలయ్యారు. వుచాంగ్‌ దవాఖాన డైరెక్టర్‌ లియూ చిమింగ్‌ కరోనా సోకి మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు వైద్యులు తెలిపారు. అయితే వెంటనే ఆయన మరణించలేదని, ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే, లియూ చిమింగ్‌ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Related posts