telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఈ నెల 12న మార్కెట్లోకి తొలి వ్యాక్సిన్.. రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన

Corona Virus Vaccine

కరోనా వైరస్ ను నివారించేదుకు తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను తొలిసారిగా ఈ నెల 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించిన తరువాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని తాము భావిస్తున్నామని యూఎస్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారైందని క్లయిమ్ చేసుకుని, దాన్ని పంపిణీ చేసే ముందు ఎటువంటి సమస్యలూ రాకుండా చూసేందుకు మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

ఈ వ్యాక్సిన్ కు గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గత వారం రక్షణ శాఖ ప్రతినిధి గ్రిడ్నేవ్ మీడియాతో మాట్లాడుతూ, మెడికల్ సిబ్బందికి, వయో వృద్ధులకు తొలిసారి వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు. వ్యాక్సిన్ సురక్షితను, పనితీరును 1,600 మందిపై పరిశీలించామని కూడా అన్నారు. గడచిన ఏప్రిల్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ సమయాన్ని కుదించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించగా వైద్య నిపుణులు మూడు దశల పరీక్షలను శరవేగంగా పూర్తి చేశారు.

Related posts