telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఒడిశా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..క‌ట‌క్‌లో పూర్తిగా ష‌ట్‌డౌన్

lockdown hyd

ఒడిశాలో క‌రోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేసులు అత్య‌ధికంగా ఉన్న క‌ట‌క్‌లో పూర్తిగా ష‌ట్‌డౌన్ విధించింది. జూలై 8 వ‌ర‌కు ఈ ష‌ట్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టంచేసింది. ఈ మేర‌కు ఒడిశా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని క‌ట‌క్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

పూర్తిగా ష‌ట్‌డౌన్ విధిస్తున్న నేప‌థ్యంలో క‌ట‌క్‌లో నిబంధ‌న‌లను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అత్య‌వ‌స‌రంకానీ దుకాణాలు, అత్య‌వ‌స‌రంకానీ ప్ర‌యాణాల‌కు జూలై 8వ‌ర‌కు అనుమ‌తి లేద‌ని క‌ట‌క్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు పేర్కొన్నారు. అయితే నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు, పాలకు సంబంధించిన దుకాణాలు ఉద‌యం 5 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంటాయ‌ని తెలిపారు. 

Related posts