telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నెల్లూరు వ్యక్తికి కరోనా లక్షణాలు..ఏపీ సర్కార్ అప్రమత్తం!

karona virus case in canada found

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు ప్రబలినట్టు తెలుస్తోంది. స్థానిక చిన్నబజారుకు చెందిన వ్యక్తి, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అతని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కరోనా వ్యాధి లక్షణాలు అతనిలో ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు.

అతని కుటుంబీకులను కూడా అదే వార్డులోని ప్రత్యేక గదిలో ఉంచి, పరిశీలిస్తున్నారు.ఇతడు మూడు రోజుల క్రితం ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చాడు. ఎయిర్ పోర్టులో దిగిన సమయంలో థర్మల్ స్క్రీనింగ్ లో ఎటువంటి జ్వర లక్షణాలూ లేకపోవడంతో బయటకు పంపినట్టు తెలుస్తోంది. ఇంటికి రాగానే కరోనా లక్షణాలు ఇతనిలో బయట పడ్డాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న ఏపీ సర్కారు అప్రమత్తమైంది. గత రెండు మూడు రోజులుగా, బాధితుడు ఎవరెవరిని కలిశాడన్న విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతను కలిసిన వ్యక్తులను సంప్రదిస్తూ, వారిని జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం జలుబు, జ్వరం లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Related posts