telugu navyamedia
వార్తలు సామాజిక

ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం..పెరిగిన ఇంటర్నెట్‌ డిమాండ్‌!

internet data

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా శాఖలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం అవకాశం కల్పించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారు కూడా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తుండడంతో ఇంటర్నెట్‌ డేటాకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు తెలియజేస్తున్నారు. 

ఇటీవల కాలంలో ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరగడం కారణంగా నెట్‌వర్క్‌ స్తంభించే అవకాశం లేదని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.డేటా డిమాండ్‌ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకావని తెలిపింది. నెట్‌వర్క్స్‌ అన్నీ ఆ మేరకు సామర్థ్యంతో ఉన్నాయన్నారు.

రిలయన్స్‌ జియో వంటి టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వారి మొబైల్స్‌లో డేటా కెపాసిటీని డిమాండ్‌కు అనుగుణంగా పెంచుతున్నాయి. టాప్‌ అప్స్‌కు సరికొత్త టారిఫ్‌ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్‌ చేసింది.

Related posts