telugu navyamedia
వార్తలు సామాజిక

భారత్ కు ఊరటనిచ్చే వార్త.. అధిక ఉష్ణ్రోగ్రతలతో కరోన కట్టడి!

corona

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ కు ఊరటనిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కరోనా వైరస్ మనుగడ సాగించడం కష్టమవుతోందని భారత శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. మన దేశంలోని అధిక ఉష్ణోగ్రతలు వైరస్ నియంత్రణను కట్టడి చేస్తాయని వారు తేల్చారు. అయితే, వాతావరణ పరిస్థితులతో పోలిస్తే, భౌతిక దూరాన్ని పాటించడమే కీలక ఆయుధమని చెప్పారు. నాగపూర్ లోని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

అధిక ఉష్ణోగ్రతల వద్ద వైరస్ లు బలహీనపడతాయని, కరోనా వైరస్ కూడా దీనికి అతీతం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించడం వంటి వాటితో మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. ఈ వ్యూహాలను పక్కాగా అమలు చేయడం వల్లే కేరళ ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలను సాధించిందని తెలిపారు.

Related posts