telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా అరికట్టేందుకు ఢిల్లీలో ఆంక్షలు

kejriwal on his campaign in ap

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీలో ఆంక్షలు విధిస్తూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని ఏ ప్రదేశంలోనూ కూడా యాభై మంది కంటే ఎక్కువ మంది ప్రజలు సమూహంగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. యాభై మందికి మించిన మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, సిమ్మింగ్‌ పూల్స్ ను ఈ నెల 31 వరకు మూసివేయాలని నిర్ణయించారు.

ర్యాలీలు, సమావేశాలపై ఆంక్షలు విధించినప్పటికీ రాష్ట్రంలో జరిగే వివాహాలకు హాజరయ్యేవారిపై ఎలాంటి పరిమితి లేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని వాయిదా వేసుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఇక, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆటోలు, ట్యాక్సీలను ఉచితంగా శుద్ధి చేయాలని (డిస్ఇన్ఫెక్ట్) నిర్ణయించారు. అలాగే, ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం తెలిపారు.

Related posts