దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో నానాటికీ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 75,760 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 1,023 మంది మృతి చెందారని వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 33 లక్షల మార్కును దాటాయి.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన పాటివ్ కేసుల్లో 7,25,991 కేసులు యాక్టివ్గా ఉండగా, 25,23,772 మంది బాధితులు కోలుకున్నారు. 7,25,991 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,85,76,510 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.