దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 83,341 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో రికార్డ్ స్థాయిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో 1,096 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 39,36,748కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 68,472 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 30,37,152 మంది కోలుకున్నారు. 8,31,124 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు మొత్తం 4,66,79,145 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.