telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం..90 వేలు దాటిన మరణాలు!

corona covid

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో కూడా దూసుకెళ్తోంది. దీంతో కేసుల సంఖ్య 56 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 83,347 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,46,011కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,085 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 90,020కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 45,87,614 మంది కోలుకున్నారు. 9,68,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.  నిన్నటి వరకు మొత్తం 6,62,79,462 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.

Related posts