telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా టెస్ట్‌లు చేయించుకొని అసెంబ్లీకి రావాలి: స్పీకర్ పోచారం

pocharam srinivasreddy

సెప్టెంబరు 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పలు సూచనలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దగ్గు, జలుబు లాంటివి ఉన్నా సభకు రావొద్దని సభ్యులకు సూచించారు. కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వస్తేనే రిపోర్టుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని వెల్లడించారు. నెగిటివ్ రిపోర్ట్ చూసిన తర్వాతనే అసెంబ్లీ లోనికి అనుమతిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.

ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్రత్యేకత వుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా కరోనా మరణాలు తగ్గాయన్నారు. అసెంబ్లీకి వచ్చే పోలీస్, మీడియా ఇతర శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా వుండాలని స్పీకర్ తెలిపారు. సమావేశాలు ప్రారంభమయ్యేలోపు కరోనా టెస్ట్‌లు చేయించుకొని అసెంబ్లీకి రావాలని తెలిపారు.

Related posts