ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా భారత్‌లో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనా మహమ్మారి తో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం.
డియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది. ఇకపోతే, ఇప్పటి వరకు ఇండియాలో కరోనాతో 4,32,079 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 88,13,919 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్పటి వరకు దేశంలో 54.58 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.
అలాగే మహారాష్ట్రంలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ అలజడి సృష్టిస్తోంది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య 76 కి చేరుకుందని సోమవారం మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు డెల్టా వేరియంట్ బారిన పడిన వారలో 10 మంది మొదటి డోసు తీసుకోగా.. 12 మంది రెండు డోసులను కూడా తీసుకున్నారని ప్రభుత్వం తెలిపింది.
పోలవరం టెండర్లను రద్దు చేసి ఏం సాధిస్తారు?: పవన్ ఫైర్