BREAKING NEWS:
construction of five star hotels in amaravati started

అమరావతిలో ఫైవ్‌స్టార్ హోటళ్ళ నిర్మాణం ప్రారంభం…

96

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భవన నిర్మాణం ఊపందుకుంది. ఇటీవల జరిగిన సమీక్షలో అమరావతిలో నిర్మాణాలను 2020 నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఈ మేరకు ఆదేశాలు జారీ కావటంతో అధికారులు కూడా పనులను వేగవంతం చేశారు. లింగాయపాలెంలో నోవాటెల్, మందడంలో డబుల్‌ట్రీ / హిల్టన్, శాఖమూరులో క్రౌన్‌ప్లాజా, నవులూరులో హిల్టన్ ఫైవ్‌స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. శాఖమూరులో హోటల్ దస్పల్లా ఫోర్‌స్టార్ హోటల్, మందడంలో జీఆర్టీ, కొండమరాజుపాలెంలో హాలిడే ఇన్, నవులూరులో గ్రీన్ పార్క్ ఫోర్ స్టార్ హోటల్‌కు అనుమతి లభించి పనులు యుద్ధప్రాతిపదికగా జరగబోతున్నాయి. ఫైవ్‌స్టార్ హోటల్‌కు 4ఎకరాలు, ఫోర్ స్టార్‌ హోటల్‌కు 2ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.