telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంఐఎం, టీఆర్ఎస్ ఒప్పందంతోనే డివిజన్లు: రేవంత్‌ రెడ్డి

Revanth-Reddy mp

ఎంఐఎం, టీఆర్ఎస్ పరస్పర ఒప్పందంతో హైద్రాబాద్ లో డివిజన్ల వర్గీకరణ చేశారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీని పై న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని ఆయన సూచించారు. పాతబస్తీలో 14వేల ఓట్లకు ఒక డివిజన్ ఉందన్నారు. అయితే కూకట్‌పల్లి వంటి చోట్ల లక్షకుపైగా ఓట్లకు ఒక డివిజన్ ఉందని తెలిపారు. ఎంఐఎంకు అనుకూలంగా ఉన్నచోట్ల తక్కువ ఓట్లు ఉండేలా చూసారని ఆరోపించారు.

ప్రణాళిక బద్ధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. టికెట్లు ఇవ్వలేని వారికి పార్టీలో పదవులు ఇస్తామని ఒప్పించి బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం 2006 ముందున్న మ్యాప్‌లను రద్దుచేసిందని తెలిపారు. సచివాలయం క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉందని, ఇప్పుడున్న చట్టాల ప్రకారమే అక్కడ అనుమతులు ఇవ్వాలన్నారు.

Related posts