telugu navyamedia
రాజకీయ వార్తలు

బ్యాంకు రుణాలు ఎగవేసిన బాడా బాబుల పేర్లు చెప్పండి : రాహుల్​

rahul gandhi to ap on 31st

భారత్‌లో బ్యాంకు రుణాలు ఎగవేసిన బాడా బాబుల వివరాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. యస్ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో ఈ రోజు లోక్‌సభ సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.

యస్ బ్యాంకులో ప్రతి ఒక్క డిపాజిటర్ సురక్షితంగా ఉంటారని హామీ ఇచ్చారు. యస్ బ్యాంకును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే, ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అయితే, మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని రాహుల్ సభ నుంచి వాకౌట్ చేశారు.

కాగా, ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కట్టడికి కేంద్ర కఠిన చర్యలకు ఉపక్రమించింది. డిఫాల్టర్ల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలను వార్తా పత్రికల్లో ప్రచురించాలని అన్ని బ్యాంకులను కోరింది. ఈ మేరకు తమ బోర్డుల నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని బ్యాంకులకు లేఖ రాసింది.

Related posts