telugu navyamedia
తెలంగాణ వార్తలు

లై డిటెక్ట‌ర్ టెస్టుకు నేను సిద్ధమే..

మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం తీవ్ర స్థాయిలో కొన‌సాగుతుంది. సామాజిక మాధ్యమం ట్విటర్‌ వేదికగా సవాళ్లు విసురుకుంటున్నారు. డ్రగ్స్‌ టెస్టు లకు నువ్వు సిద్దామా ? అంటే నువ్వు సిద్దామా ? అన్న రీతిలో ఇద్దరూ లీడర్లు రెచ్చిపోతున్నారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో తన స్థాయి కాదని, క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా’’ అని కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు.

దీనిపై.. రేవంత్ రెడ్డి స్పందిస్తూ..తాను లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధం.. మాతో పాటు కేసీఆర్‌ కూడా లై డిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమా? అని రేవంత్‌ రెడ్డి ప్రతి సవాల్‌ విసిరారు. .

వైట్​ ఛాలెంజ్​లో భాగంగా… హైదరాబాద్‌ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద రేవంత్‌ ధర్నా చేపట్టారు. గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు బైఠాయించారు. రేవంత్ వైట్ ఛాలెంజ్‌ను కేటీఆర్ స్వీకరించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిషేధించాలని.. మండిపడ్డారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి..

Related posts