telugu navyamedia
రాజకీయ

ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెసు ఆశలు వదులుకోవాల్సిందేనా?

CLP Batti vikramarka fire KCR KTR
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు  టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు తగినంత బలం లేక ఏం చేయాలో రాష్ట్ర నాయకత్వానికి దిక్కుతోచడం లేదు. శాసనమండలి ఎన్నికపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య  విమర్శలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరు కాగా, ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనట్లు తెలుస్తోంది.

Related posts