తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఇంఛార్జీ, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు కలిసి అభ్యర్థిని ఎంపిక చేయాలన్నారు. టీఆర్ఎస్ వాళ్లు చేసే ఖర్చు కన్నా ఎక్కువ డబ్బులు మనం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.
కష్టపడి ఐక్యంగా పని చేసి పోటీ చేసిన వారంతా గెలిచి రావాలన్నారు. మీరు గెలవకుంటే ఎమ్మెల్యేగా నాకు గౌరవం ఉండదు. టిక్కెట్ విషయంలో ఎవరికైనా మిస్సయితే వారికి కో ఆప్షన్ మెంబర్‌గా అవకాశం ఇస్తాం.. నా దగ్గర డబ్బులు లేవు.. నేను ఎవరికీ ఇవ్వను.. డబ్బుల టెన్షన్ నాకు పెట్టొద్దని జగ్గారెడ్డి అన్నారు.నా భార్యకు కూడా నేను టిక్కెట్ ఇవ్వాలా.. వద్దా అనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పారు. నామినేషన్ల తరువాత అభ్యర్థులందరితో సమావేశమవుతానని తెలిపారు.