telugu navyamedia
రాజకీయ

యూపీలో కాంగ్రెస్ ఓట‌మి : ఆ ముగ్గురే ముంచారు..

యూపీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీయే విజయం సాధించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమేంటి? ఆ ముగ్గురి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందా?

ముగ్గురు ముంచారు..

మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్… సీఎం చరణ్​జీత్ సింగ్…. కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ…. కాంగ్రెస్​ను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసిన త్రిమూర్తులు. పార్టీతో అంతర్గత కలహాలతో విసిగిపోయి సీఎం పీఠం వదులుకొని.. వేరు కుంపటి పెట్టి అమరీందర్ పరోక్షంగా దెబ్బకొడితే.. సిద్ధూ, చన్నీల మధ్య రగడ కాంగ్రెస్​ను నిలువునా ముంచేసింది.

‘కాంగ్రెస్​ను కాంగ్రెస్ తప్ప ఎవరూ ఓడించలేరు’.. ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్య ఇప్ప‌డు నిజమైంది.

అమరీందర్ సింగ్ కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పిన తర్వాత సీఎం కుర్చీ తనకు వస్తుందని సిద్ధూ భావించారు. అయితే, చన్నీని కాంగ్రెస్‌ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అధిష్ఠానం నిర్ణయాన్ని సమ్మతించినట్లు సిద్ధూ ప్రకటించినా.. తనకు సీఎం పదవి దక్కకపోవడంపై గుర్రుగా ఉన్నారు. పలు వేదికల నుంచి బహిరంగంగా అసమ్మతి వ్యాఖ్యలు చేశారు. సీఎంను గద్దె దించే సత్తా నాకు ఉందని హెచ్చరించారు. ‘నా దారి రహదారి’ అన్న చందాన సిద్ధూ వ్యవహరించారు. పార్టీలోని ఇతర నేతలను కలుపుకొని పోలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని విపక్షాల కంటే.. అంతర్గత కలహాలు, అసమ్మతులే దెబ్బతీశాయి..

సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ శిబిరాల మధ్య విభేదాలే ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

 

Related posts