telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ పీసీసీ పదవి నాదే .. : వీహెచ్

congress senior leader VH on rahul resignation

రాష్ట్రం విద్యార్థుల బలిదానాలు వల్ల వచ్చిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయుకుడు వీ హనుమంతరావు అన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల బలిదానాల మీద కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని వీహెచ్‌ విమర్శించారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది మీద కేంద్రం సవతి ప్రేమ చూపుతుందంటున్న కేటీఆర్‌.. మరీ తెలంగాణలోని విద్యార్థుల కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క విద్యార్థికైనా ఉద్యోగం కల్పించారా అని వీహెచ్‌ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేటీఆర్‌ ఏవిధంగా నిందిస్తున్నారో.. తెలంగాణలోని విద్యార్థులు కూడా టీఆర్‌ఎస్‌ను అలాగే నిందిస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు.

విద్యార్థులకు కనీసం ఉపకార వేతనము కూడా ఇవ్వటం లేదని వీహెచ్‌ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు వారి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 30 మంది కార్మికులు చనిపోయాక సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ మీద ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి తప్పకుండా తనకే ఇవ్వాలని.. తన కంటే సీనియర్‌ నాయకుడు రాష్ట్రంలో ఎవరు లేరని అన్నారు. ప్రజల్లోకి వెళ్లే సత్తా తనకు మాత్రమే ఉందని వీహెచ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం తప్పకుండా తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తుందనే వీహెచ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Related posts