telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూన్ 2 తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం ఆమెతో భేటీ అయన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.

”రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియాను ప్రత్యేక అతిథిగా పిలవాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా ఆమె భాగస్వామ్యాన్ని ఈ పదేళ్ల ఉత్సవాల్లో ప్రజలు కోరుకుంటున్నారు.

రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు ఆమెను సత్కరించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయదలచుకున్నాం.

మా ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినందుకు పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కర్నీ దశాబ్ది ఉత్సవాలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నాం.

అందరికీ సముచిత గౌరవం కల్పిస్తాం” అని పేర్కొన్నారు.

Related posts