telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈరోజు హనుమకొండ లో పరియటించనున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు వస్తున్నారు. హనుమకొండలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న రాహుల్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి హనుమకొండకు హెలికాప్టర్ లో చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు.

అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ సమావేశమవుతారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో హనుమకొండలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

హనుమకొండ పర్యటన అనంతరం ఈ రాత్రి 7.30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఆయన రైల్లో తమిళనాడుకు బయల్దేరుతారు.

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తారు. ఈ సందర్భంగా రైల్లోనే విద్యార్థులతో అయన ముఖాముఖి నిర్వహిస్తారు.

Related posts