telugu navyamedia
రాజకీయ వార్తలు

ఐఎన్ ఎక్స్ కేసులో బిగుస్తున్న ఉచ్చు.. చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధం..!

congress chidambaram

2007లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ నేత చిదంబరం ఐఎన్ ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులకు చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని సీబీఐ, ఈడీ చెబుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు అందుకున్నారని కేసులు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో చాలామంది బీజేపీ, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు కేసులతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను జైలుకు పంపి వేధించారని బీజేపీ మద్దతుదారులు చెబుతున్నారు. ఇప్పుడు చిదంబరం వంతు వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. హోంమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని ఉసిగొల్పి చిదంబరం తమ నాయకుడు జగన్ ను తీవ్రంగా వేధించాడని వైసీపీ మద్దతుదారులు సైతం గుర్తుచేస్తున్నారు.

Related posts