telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమెరికా లో చదివి పల్లె గడపల వద్దకు వచ్చి రూపురేఖలు మార్చేశావ్ కంగ్రాట్స్ డియర్ లోకేష్ : నారా బ్రాహ్మణి

ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా.. ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

“అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఇడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్.

పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు.

నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు.

నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది.

కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్”

Related posts