హీరోలు, హీరోయిన్లు కొన్ని నిత్యవసర వస్తువులకు సంబంధించిన ప్రకటనలకు, బ్రాండ్లకు అంబాసిడర్లుగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇటీవల విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం రాశి, రంభ నటించిన ఓ వాణిజ్య ప్రకటనను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘వెయిట్ లాస్’ ప్రొడక్ట్ పేరుతో వారు నటించిన ఆ ప్రకటన ద్వారా చాలామంది మోసగించబడ్డారన్న ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఆ తీర్పునిచ్చింది. ఏదేమైనా హీరోలు,హీరోయిన్లు కమర్షియల్ యాడ్స్‌లో నటించేముందు కాస్త వాటి వివరాలు తెలుసుకుంటే మంచిది. చాలామంది తమ అభిమాన నటీనటులను చూసి ఆయా వస్తువులను కొంటూ ఉంటారు. కాగా… తాజాగా హీరోయిన్ అంజలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోవై సుడర్‌పార్వై మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఓ కల్తీ వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆ వంట నూనెను తాము ల్యాబ్‌కి పంపించి టెస్టులు చేయించగా హానికరం అని తేలిందన్నారు. ఇలాంటి వంట నూనెలు విక్రయించడం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమేనన్నారు. దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అంజలి.. ఒకరకంగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
previous post
హీరోలు, టెక్నిషియన్ లు పారితోషికం తగ్గించుకోవాలంటున్న దర్శకుడు