telugu navyamedia
విద్యా వార్తలు

కామ‌న్ పీజీ ప్ర‌వేశ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌..

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలోని ఏడు యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ)- 2021 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. సీపీగెట్​లో 92.51 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన‌ట్లు తెలిపారు.

So you didn't make it to DU, now what?

తెలంగాణ వ్యాప్తంగా 78,312 మంది ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 68,836 మంది హాజరు అయ్యార‌ని, అయితే ఇందులో 63,748 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. దీనిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏడు యూనివర్సిటీలైన‌ ఓయూ, కేయూ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్​టీయూల్లో పీజీ కోర్సుల భర్తీ చేయనున్నారు. .

Related posts