telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన‌సాగుతున్న సీఎం ప‌ర్య‌ట‌న‌..

ఏపీ వరద ప్రభావిత జిల్లాల్లో ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. కడప జిల్లా రాజంపేట మండలంలో జగన్‌ పర్యటన కొనసాగుతోంది. పులపుత్తూరు గ్రామంలో తిరుగుతూ బాధితులను పరామర్శించారు.నేరుగా రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగితెలుసుకున్నారు.

సర్వం కోల్పోయామని..ఆదుకోవాలని బాధితులు జగన్​కు మొర పెట్టుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులతో సీఎం మాట్లాడారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.వరదల కారణంగా డ్వాక్రా డబ్బులు చెల్లించలేమని మహిళలు సీఎంకు తెలపగా.. ఏడాదిపాటు మారటోరియం విధిస్తామని సీఎం హమీ ఇచ్చారు.

Thumbnail image

గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఎన్ఆర్​పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

కాగా..ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గురు, శుక్రవారాల్లో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లోని పరిస్థితులను పరిశీలించనున్నారు.

Related posts