టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరవుతున్న విరాట్ కోహ్లీ తన తదుపరి ప్రయాణంలో మరెన్నో విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు విరాట్ కోహ్లీ అని, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన అధ్యాయాన్ని కొనసాగించారని అభినందించారు. ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత గల ఆటగాడిగా నిలిచారని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. కోహ్లీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు.
ఎఐసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు: డీకే అరుణ