telugu navyamedia
రాజకీయ

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం వ్యర్థం: మమత

mamata benerji

ఢిల్లీలో ఈ నెల 15 నీతి ఆయోగ్ సమావేశం  జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి తాను హాజరుకావడం లేదని  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ కు ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవని,  అలాంటప్పుడు ఈ సమావేశానికి హాజరుకావడం వ్యర్థమని ఆ లేఖలో పేర్కొన్నారు.

 కొంత కాలంగా ప్రధాని మోదీ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న మమతా బెనర్జీ ఈ లేఖ ద్వారా మరోసారి తన నిరసన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో వాటర్ మేనేజ్ మెంట్, వ్యవసాయం, భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు.ఈ  సమావేశంలో కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. 

Related posts