telugu navyamedia
రాజకీయ వార్తలు

బెంగాల్ మర్యాదను కాషాయం పార్టీ దెబ్బతీసింది: మమత

BJP compliant EC West Bengal

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. బెంగాల్ గౌరవాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అయోధ్యలో రామాలయం నిర్మించలేని బీజేపీ ప్రభుత్వం.. విద్యాసాగర్ విగ్రహాన్ని నిర్మిస్తుందా? అని ప్రశ్నించారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చి బెంగాల్ మర్యాదను కాషాయం పార్టీ దెబ్బ తీసిందన్నారు.

ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కెఃప్పారు. బీజేపీ ముందు బెంగాల్ మోకరిల్లద్దని చెప్పారు. ఒక్క బెంగాలీ కూడా బీజేపీకి ఓటు వేయరని తెలిపారు. బీజేపీ హయాంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేస్శారు. దేశ సమగ్రతను బీజేపీ దెబ్బతీస్తోందన్నారు. మోదీ ఓ సైతాన్, అమిత్ షా ఓ గూండా అని ఆమె దుయ్యబట్టారు. తనను ఎవరూ భయపెట్టలేరని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

Related posts