టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కరోనా నేపథ్యంలో వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మరో సందర్భంలో పార్టీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం.
మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే జెండాలు ఎగురవేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆరు ఏళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక అద్భుతాలు సాధించిందని, దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దశాబ్దాల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించామని తెలిపారు.