telugu navyamedia
తెలంగాణ వార్తలు

అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన సీఎం కేసీఆర్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.బిహార్‌ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న ఆయన.. తొలుత ఆ రాష్ట్ర సీఎం నీతీశ్‌ కుమార్‌ , ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు.

కేసీఆర్‌.. నేరుగా బిహార్‌ సీఎం నీతీశ్‌ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్‌కు నీతీశ్‌తో పాటు బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఘనస్వాగతం పలికారు.

Thumbnail image

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరుల కుటుంబాలకు నీతీశ్‌, తేజస్వీతో కలిసి చెక్కులు అందించారు.

అంతేకాకుండా కొద్దినెలల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన 12 మంది బీహార్‌ వలస కార్మికుల కుటుంబాలకూ రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. గాల్వాన్ అమరుల కుటుంబాలకు ఆదుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

CM KCR Bihar tour

కాగా గాల్వాన్ అమరవీరులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ బుధవారం పాట్నా వెళ్లారు..

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీహార్‌కు ఎంతో చరిత్ర ఉందంటూ పేర్కొన్నారు. గోదావరి తీరం నుంచి గంగా పరివాహక ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు.

బీహార్ నుంచి తెలంగాణకు.. లక్షలాది మంది కార్మికులు వస్తారని.. రాష్ట్ర అభివృద్ధిలో బీహార్ కార్మికుల పాత్ర ఉందని పేర్కొన్నారు. బీహార్లో మంచి ప్రభుత్వం ఉందన్నారు. కరోనాకాలంలో వలస కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తుచేశారు. నాడు వలస కార్మికుల కోసం రైళ్లు ఏర్పాటు చేశామని ప్రస్తవించారు.

అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మనబాధ్యత’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గాల్వాన్‌లో వీరజవాన్ల త్యాగం ఎంతో గొప్పదని, దేశం కోసం జవాన్లు ప్రాణ త్యాగం చేశారని కేసీఆర్ అన్నారు.

Related posts